భారత్ లో 14 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

భారత్ లో 14 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
X

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 14 వేల 681 కు పెరిగింది. గుజరాత్‌లో శనివారం 173, రాజస్థాన్‌లో 41, పశ్చిమ బెంగాల్‌లో 32, ఆంధ్రప్రదేశ్‌లో 31, మేఘాలయలో 2 నివేదికలు పాజిటివ్ గా వచ్చాయి. అంతకుముందు రోజు (శుక్రవారం) గరిష్టంగా 273 మందిని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేశారు. ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద డిశ్చార్జ్ సంఖ్య. వీరిలో అత్యధికంగా 103 మంది రోగులు తమిళనాడులో ఉండగా, ఇండోర్‌లో 35 మంది రోగులు ఉన్నారు.

వీరితో పాటు మహారాష్ట్రలో 31, హర్యానాలో 21, ఢిల్లీ 20, రాజస్థాన్‌లో 19 మంది ఆరోగ్యంగా ఉండటంతో ఆసుపత్రినుంచి విముక్తి లభించింది. రాజస్థాన్‌లో కరోనా కేంద్రంగా ఉన్న భిల్వారాలో సోకిన వారందరూ కోలుకున్నారు. జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి, అందులో 2 మంది మరణించారు.

ఈ గణాంకాలు covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం వెల్లడించినవి. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో 14 వేల 378 కరోనా పాజిటివ్‌లు బయటపడ్డాయి. వీరిలో 11 వేల 906 మంది చికిత్స పొందుతున్నారు, 1,991 మందికి నయమైంది. 480 మంది మరణించారు.

Next Story

RELATED STORIES