కుమారుడి పెళ్లిపై స్పందించిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

మాజీ ప్రధాని దేవెగౌడ మనమడు నిఖిల్ వివాహంపై ప్రభుత్వం అడగటంపై.. కర్ణాటక మాజీ సీఎం హెచ్ డి కుమారస్వామి స్పందించారు. తాము పెళ్లిలో మాస్క్ లు ధరించాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి కుమారుడు.. హీరో నిఖిల్ వివాహం కాంగ్రెస్ నేత క్రిష్ణప్ప మనవరాలు రేవతితో రామ్‌నగర్ కేతగానహళ్లిలోని ఫాం హౌస్‌లో జరిగింది. ఈ వివాహానికి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులతో పటు మరికొందరు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. అయితే.. ఈ పెళ్ళిలో సామాజిక దూరం పాటించలేదని సోషల్ మీడియాలో వార్తలు రావటంతో.. దీని పై ప్రభుత్వం నివేదిక కోరింది. దీనిపై ట్వీటర్ వేదికగా స్పందించిన మాజీ సీఎం కుమార స్వామీ కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పెళ్లికి ముందు తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. తాము పెళ్లిలో మాస్క్ లు ధరించాల్సిన అవసరం లేదని.. పెళ్లి చేయడం ద్వారా తప్పు చేయలేదని ట్వీట్ చేశారు. దీనితో పాటు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి.. కరోనా ప్రభావం తగ్గిన తరువాత మీతో కలిసి కూర్చుని భోజనం చేస్తానంటూ మరో ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com