లాక్ డౌన్ ఎఫెక్ట్ .. రోడ్డుపై నిద్ర‌పోతున్న సింహాలు

లాక్ డౌన్ ఎఫెక్ట్ .. రోడ్డుపై నిద్ర‌పోతున్న సింహాలు

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఈ కరోనా కట్టడికి పలు దేశాల్లో లాక్ డౌన్ విధించారు. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. గడప దాటి బటకు రావటం లేదు. కేవలం నిత్యవసరాలకు మాత్రమే బయటకు అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అడవిలోని సింహాలన్నీ రోడ్డుపైకి వచ్చిఎంజాయ్ చేస్తున్నాయి. జ‌న సంచారం లేక‌పోవ‌డంతో.. కొన్ని కొన్ని ప్రాంతాల్లోకి ర‌క‌ర‌కాల జంతువులు వ‌చ్చేస్తున్నాయి. అంతే కాదు అవి ఆ రోడ్ల‌పై హాయిగా నిద్ర పోతున్నాయి. దక్షిణాఫ్రికాలో ఇలాంటి ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

సౌతాఫ్రికాలో సింహాల‌కు ఫేమ‌స్‌ అయిన క్రూగ‌ర్ నేష‌న‌ల్ పార్క్‌కు విదేశీ టూరిస్టులు ఎక్కువ‌గా వ‌స్తుంటారు. అయితే క‌రోనా నేప‌థ్యంలో ఆ దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ విధించారు. దీంతో ప‌ర్యాట‌కుల‌కు బ్రేక్ ప‌డింది. ఈ స‌మ‌యంలోనే క్రూగ‌ర్ పార్క్‌లో ఉన్న సింహాలు.. ఇప్పుడు స్వేచ్చ‌గా విహ‌రిస్తున్నాయి. అవి ఆ పార్క్‌లో ఉన్న తారు రోడ్డుపై కునుకు తీస్తున్నాయి. ఆ పార్క్‌లో ఉన్న ఓ రెస్టు క్యాంపు స‌మీపంలో సింహాలు నిద్ర‌పోవ‌డాన్ని ఓ ఫోట‌గ్రాఫ‌ర్ త‌న కెమెరాలో బంధించారు. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story