యువ‌తిపై ఉమ్మివేసిన వ్యక్తి అరెస్టు

యువ‌తిపై ఉమ్మివేసిన వ్యక్తి అరెస్టు
X

ఓవైపు కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవడానికి లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నా.. కొందరు పోకిరీలు, ఆకతాయిలు మాత్రం రెచ్చిపోతున్నారు. జనాల్లో నిండిన కరోనా భయాన్ని అలుసుగా తీసుకుని వికృత చర్యలకు పాల్పడుతున్నారు. రోడ్డుపై వెళుతున్న అమ్మాయిలపై వెకిలి చేష్టలకు పాల్పడుతూ, భయాందోళనకు గురి చేస్తున్నారు. కరోనా వైరస్ తో విలవిలలాడిపోతున్న ముంబైలో ఇటీవల దారుణం జరిగింది. ఏప్రిల్ 6న‌ నిత్యావ‌స‌రాలు తెచ్చుకునేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న యువతిపై ఓ యువకుడు ఉమ్మివేసి పారిపోయాడు. ఊహించని ఘటనతో ఆ యువతి షాక్ కి గురై.. పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. సీసీటీవీ ఆధారంగా విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ప‌ది రోజుల త‌ర్వాత‌ నిందితుడిని ప‌ట్టుకున్నారు. అత‌డు ప‌శ్చిమ‌ ముంబైలోని కుర్లాలో నివ‌సించే అమిర్‌ఖాన్‌గా గుర్తించారు.

Next Story

RELATED STORIES