క‌ర్ణాట‌క‌ను భయపెడుతోన్న మంకీ ఫీవ‌ర్‌

క‌ర్ణాట‌క‌ను భయపెడుతోన్న మంకీ ఫీవ‌ర్‌

కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అది చాలదన్నట్లు ఇప్పుడు మంకీ ఫీవర్ కూడా పెచ్చరిల్లుతోంది. ఒకవైపు కరోనాతో భయం వెంటాడుతుంటే.. మరోవైపు ఈ మంకీ ఫీవర్‌ ఉత్తర కన్నడ జిల్లాను భయపెడుతోంది. తొలుత సిద్ధాపుర తాలూకాలో నాలుగు మంకీ ఫీవర్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మంకీ ఫీవ‌ర్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కొత్తగా వచ్చిన మంకీ ఫీవర్ కారణంగా ప్రజలను ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ ఈ వ్యాధి రాష్ట్రంలోని 12 జిల్లాలకు వ్యాపించిన‌ట్లు తెలుస్తోంది. సుమారు రెండు వందలపైన కేసులు నమోదయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఈ వైరస్‌పై కూడా వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ సర్కార్ అప్ర‌మ‌త్త‌మై నివారణ చర్యలు చేపట్టారు. నాలుగు రోజుల పాటు జ్వరం వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story