20 నుంచి టోల్‌ వసూలు.. రవాణా సంఘాల అభ్యంతరం

20 నుంచి టోల్‌ వసూలు.. రవాణా సంఘాల అభ్యంతరం
X

ప్రస్తుతం దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో.. ఈ నెల 20 నుంచి ఇచ్చిన సడలింపు దుష్ట్యా అంతరాష్ట్ర సరుకుల రవాణా మరింత సులభతరం కానుంది. అయితే ఈ క్రమంలో జాతీయ రహదారులపై టోల్‌ రుసుములను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వసూలు చేయాలనీ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రవాణా సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి.. ప్రస్తుత సంక్షోభ సమయంలో రవాణా ఎంతో అవసరమని.. ఇలాంటి పరిస్థితులలో టోల్ రుసుము కరెక్ట్ కాదని అంటున్నాయి.. కరోనా భయంతో ట్రక్కులకు డ్రైవర్లు దొరకడం లేదని..

పైగా కార్యకలాపాలు కొనసాగించడానికి ఫైనాన్స్ కూడా దొరకడం లేదు.. ట్రక్కుల యజమానులు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు.. ఈ తరుణంలో టోల్ వసూలు చెయ్యడం మంచిది కాదు.. దీనిపై పునరాలోచించాలని అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ కేంద్ర మంత్రిత్వశాఖను అభ్యర్ధించింది. వాస్తవానికి కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా అత్యవసర సేవలను సులభతరం చేయడానికి జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం మార్చి 25 న ప్రకటించింది. అయితే తాజాగా ఈనెల 20 నుంచి టోల్ వసూలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఏఐ కు లేఖ రాసింది.

Next Story

RELATED STORIES