రంజాన్ పండగ ఇంట్లోనే జరుపుకోవాలి: మత పెద్దలు

రంజాన్ పండగ ఇంట్లోనే జరుపుకోవాలి: మత పెద్దలు

రంజాన్ పండగను అందరూ ఇంట్లోనే నిర్వహించుకోవాలని సౌదీ అరేబియా మతపెద్ద గ్రాండ్‌ ముఫ్తీ షేక్‌ అబ్దులాజీజ్‌ అల్ షేక్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మసీదులకు వెళ్లే పరిస్థితులు లేవని ఉపవాస దీక్షలు, అనంతర తారావీహ్‌ ప్రార్థనలు ఇంట్లోనే నిర్వహించుకోవాలని కోరారు. ఇస్లాంను విశ్వసించేవారంతా ఈ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

రంజాన్‌ పర్వదినంలో మదీనాలోని ప్రముఖ మసీదులో ప్రతిరోజు ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. మసీదుకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించింది. సౌదీలో ఇప్పటి వరకు 7,142 కరోనా కేసులు నమోదవ్వగా.. 87 మంది మరణించారు.

ఇక హైదరాబాద్‌లో కూడా జామియా నిజామియా సంస్థ రంజాన్ ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. దీనికి హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సైతం మద్దతు తెలిపారు. సంస్థ సూచనలను పాటించాలని పిలుపునిచ్చారు.

కాగా.. వచ్చే వారం నుంచి రంజాన్ మాసం మొదలు కానుంది.

Tags

Read MoreRead Less
Next Story