ప్రీపెయిడ్ కస్టమర్లకు రిలయన్స్ జియో శుభవార్త

ప్రీపెయిడ్ కస్టమర్లకు రిలయన్స్ జియో శుభవార్త
X

ప్రీపెయిడ్ కస్టమర్లకు రిలయన్స్ జియో శుభవార్త అందించింది. ప్రీపెయిడ్ వినియోగదారుల కాలపరిమితి ముగిసినా దీనిని మే 3 వరకు పొడిగించింది. దీంతో ప్రస్తుతం ఉన్న ప్రీపెయిడ్ కస్టమర్లకు వారి చెల్లుబాటు గడువు ముగిసినప్పటికీ ఇన్‌కమింగ్ కాల్స్ పొందవచ్చు. ఈ మేరకు రిలయన్స్ జియో ప్రకటించింది.

అలాగే ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని తమ రిటైల్ అవుట్‌లెట్లలో ఎక్కువ భాగం ఏప్రిల్ 20 నుండి కార్యకలాపాలు ప్రారంభిస్తామని టెలికాం క్యారియర్ ప్రకటించింది. అలాగే లాక్డౌన్ కారణంగా వినియోగదారులు కొందరికి రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో వొడాఫోన్, ఐడియా వారి చందాదారులకు ఉపశమనం ప్రకటించింది, వీరి చెల్లుబాటును మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES