ఒక్కరోజులోనే భారీగా పెరిగిన కేసులు

ఒక్కరోజులోనే భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనావైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా వైరస్ చైన్ ను బ్రేక్ చేయలేకపోతున్నారు. బుధవారం కేవలం ఆరు కేసులే నమోదు కావడంతో కొద్దిమేర ఊరట కలిగించినా అంతలోనే కేసులు మళ్ళీ ఊపందుకున్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 50 కేసులు నమోదు కాగా శుక్రవారం కూడా అదే స్థాయిలో వైరస్ కేసులు కొనసాగాయి. ఏకంగా 66 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్టంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 766 కు చేరింది. ఇప్పటివరకూ వైరస్ భారిన పడి 18 మంది చనిపోయారు. వైరస్ నుంచి 186 మంది కోలుకున్నారు.

రాష్టంలోని 33 జిల్లాల్లో GHMC పరిధిలోనే కావున ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కొత్తగా నమోదైన 60 కేసులలో 30 పాజిటివ్ కేసులు GHMC పరిధిలోనే ఉన్నాయి. కొత్తగా నిర్ధారణ అయిన 30 మందిని గాంధీ ఆసుపత్రికి తరలించామని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు వారితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారికి కూడా కావున టెస్టులు నిర్వహించి క్వారంటైన్ కు తరలించినట్టు తెలిపారు. ఇక GHMC తరువాత సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ దడపుట్టిస్తోంది. శుక్రవారం 15 మందికి పాజిటివ్ నిరాదరణ అయింది. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story