కరోనానుంచి కాపాడేందుకు కొత్త బస్సు వచ్చింది..

కరోనానుంచి కాపాడేందుకు కొత్త బస్సు వచ్చింది..
X

లాక్డౌన్ వల్ల ఇంట్లో కూర్చున్నాం బాగానే ఉంది. కానీ మే 3 తరువాత నుంచైనా ఎవరి పనుల కోసం వారు బయటకు వెళ్లాలి కదా. బస్సులెక్కి ప్రయాణించే వారు బోలెడంత మంది. సామాజిక దూరం కాదు కదా కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ లేనంత రష్‌గా ఉంటాయి హైదరాబాద్ సిటీ బస్సులు, కడ్డీలు పట్టుకుని వేలాడుతూ గమ్యస్థానాలకు చేరే నగర జీవులు ఎందరో. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టసీ కొత్త తరహా బస్సులను రూపొందించింది.

ఈ బస్సులోకి ఎక్కగానే ప్రయాణీకులను శుభ్రపరుస్తుంది. కరోనా వైరస్ బారినుంచి కాపాడే నిమిత్తం యాంటీ వైరల్ లిక్విడ్‌ను బస్సులో అమర్చారు. బస్సులోకి ఎక్కిన వెంటనే ఇరువైపులా అమర్చిన నాజిల్స్ ద్వారా సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయబడుతుంది. ఇప్పటి వరకైతే ఈ బస్సులను ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగులందరూ కార్యాలయాల్లోకి వెళ్లే ముందు తమని తాము పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని ఆర్టీసీ అధికారి తెలిపారు. శానిటైజర్ బస్సు తయారీకి ఖర్చు కేవలం 10 వేల రూపాయలు మాత్రమే ఖర్చైందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. కాచిగూడ బస్సు డిపోలో ఈ సానిటైజర్ బస్సు అభివద్ధి చేశారు.

Next Story

RELATED STORIES