ఆపదలో అండగా భారత్.. మోదీపై ఐరాస ప్రశంసల జల్లు..

ఆపదలో అండగా భారత్.. మోదీపై ఐరాస ప్రశంసల జల్లు..

అందరి బంధువయా భద్రాచల రామయ్యా.. ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య.. ప్రస్తుతం భారత ప్రధాని మోదీకి కూడా ఈ పదాలు సరిగ్గా సరిపోతాయేమో.. అందుకే ఐరాస సైతం భారతదేశాన్ని వేనోళ్ల పొగుడుతోంది. ఐరాస విజ్ఞప్తిని మన్నించి ఇతర దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల్ని అందించి అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ భారత్‌ని కొనియాడారు.

దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ మహమ్మారినుంచి బయటపడాలని చూస్తున్నాయి. అందుకోసం ఏ చిన్న సహాయం దొరికినా ఎంతో సంతోషిస్తున్నాయి. ఏం కావాలన్నా ఎవరిని అడగడానికైనా వెనుకాడ్డం లేదు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల కోసం కరోనా బాధిత దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి.

అగ్రరాజ్యం అమెరికా సైతం భారత్‌ని మాత్రలు పంపించమని కోరింది. అడిగిన వెంటనే ప్రధాని మోదీ మాత్రలు పంపించి తన ఉదారతను చాటుకున్నారు. ప్రతిఫలంగా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. భారత్ సహాయాన్ని పొందిన అమెరికాతో పాటు అఫ్ఘానిస్ధాన్, శ్రీలంక, మారషస్‌తో పాటు పలు ఐరోపా, ఆఫ్రికా దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మరో వైపు రెండు లక్షల క్లోరోక్విన్ మాత్రల్ని అందుకున్న డొమినిక్ రిపబ్లిక్ సైతం భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. క్లోరోక్విన్ మాత్రల్ని పంపించాలన్న రష్యా అభ్యర్ధనను కూడా భారత్ స్వీకరించింది.

Tags

Read MoreRead Less
Next Story