మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చైర్మన్ గా ఓ కమిటీ

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చైర్మన్ గా ఓ కమిటీ
X

ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై అధ్యయనం చేయటానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ సంప్రదింపుల కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి చైర్మన్ గా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉండగా.. కన్వీనర్‌గా పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వ్యవహరిస్తారు. ఈ కమిటీ.. ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై అధ్యయనం చేసి.. నిర్మాణాత్మక సలహాలను ఇస్తుంది. దీంతో పాటు ఆయా అంశాలపై పార్టీ వైఖరిని కూడా ప్రకటించనుంది.

ఈ బృందం ప్రతిరోజూ కలిసి ఆయా అంశాలపై చర్చిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ కమిటీలో రాహుల్ గాంధీ ఒక సభ్యునిగా ఉండగా.. పి. చిదంబరం, జైరాం రమేశ్, మనీశ్ తివారీ, ప్రవీణ్ చక్రవర్తి, గౌరవ్ వల్లభ్, సోషల్ మీడియా ఇన్‌చార్జీ రోహన్ గుప్త తదితరులు కూడా ఉంటారు.

Next Story

RELATED STORIES