Top

ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుకింగ్స్ షురూ..

ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుకింగ్స్ షురూ..
X

కరోనా కారణంగా ఎక్కడి వారక్కడే గప్‌చుప్‌గా ఇళ్లలో ఉన్నారు. అన్ని రవాణా సర్వీసులు నిలిపివేశారు. మే3 తో లాక్‌డౌన్ ముగుస్తున్న సందర్భంగా ప్రయాణీకులు తమ ప్రయాణాలను ప్రారంభించవచ్చని తెలిపింది ఎయిర్ ఇండియా. మే 4 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. వీటికి సంబంధించిన బుకింగ్ కౌంటర్‌ను ఓపెన్ చేసింది. ఇక జూన్ 1 నుంచి చేయబోయే అంతర్జాతీయ సర్వీసులకు కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.

కోవిడ్ కారణంగా విమాన సర్వీసులన్నీ నిలిచిపోయాయి. అట్లాంటి సమయంలో విదేశాలలో ఉన్న భారత పౌరులను రక్షించే నిమిత్తం సర్వీస్ చేసింది ఎయిర్ ఇండియా. వ్యవసాయానికి సంబంధించిన వస్తువులను, వైద్య పరికరాలను ప్రపంచ మార్కెట్‌కు రవాణా చేస్. కాగా, ఎయిర్ ఇండియా సంస్థ యూకె, జర్మనీ, ఇజ్రాయెల్, చైనా, సీషెల్స్, మారిషస్, శ్రీలంక, మాల్దీవులకు వెళ్లే మార్గాల్లో తన సేవలు ప్రారంభించింది.

Next Story

RELATED STORIES