coronavirus : భారత్ లో నయమైన కేసులు 14 శాతం..

coronavirus : భారత్ లో నయమైన కేసులు 14 శాతం..

నిన్నటివరకు 1991 కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు నయమయ్యాయని శనివారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఇది మొత్తం సోకిన వారిలో 14% అని తెలిపింది. ఇక కోవిడ్ వ్యాధి మరణాల రేటు 3.3% గా ఉంది. దీని అర్థం ప్రతి 100 మందిలో 3 నుండి నలుగురు మాత్రమే వ్యాధి సోకిన వారు మరణిస్తున్నారు.

మరణాల రేటు 0-45 సంవత్సరాల వయస్సు గల రోగులలో 14.4% గా ఉండగా 45-60 సంవత్సరాల వయస్సు వారు 10.3% ఉన్నారు. ఇక 60-75 సంవత్సరాల వయస్సులో 33.1%. 75 ఏళ్లు పైబడిన వారిలో ఈ రేటు 42.2% గా ఉందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇదిలావుంటే శనివారం నాటికి భారత్ లో 15,815 సంక్రమణ కేసులుండగా.. 500 కు పైగా మరణాలు సంభవించాయి.

Tags

Read MoreRead Less
Next Story