గూగుల్‌లో తప్పులెదకడం.. అదే ఉద్యోగం మరి..

గూగుల్‌లో తప్పులెదకడం.. అదే ఉద్యోగం మరి..
X

ఏంటీ.. నేను చేసిందే తప్పు పడుతున్నావు.. నా కంటే నీ కంత బాగా వచ్చా.. మరీ అంత ఓవరాక్షన్ చేయకు.. నోర్మూసుకుని నీ పని నువు చేసుకో అని కదా అంటాం మన తప్పుల్ని అస్సలు స్వీకరించని మనం. కానీ గూగుల్ మాత్రం నాలో ఉన్న తప్పుల్ని వెదికితే నీకు లక్షల్లో జీతం ఇస్తాను అని అనేసరికి అదే ఉద్యోగంగా మార్చుకున్నాడు కేరళకు చెందిన ప్రతీష్ నారాయణ్. అలా ఇప్పటి వరకు ఒకటీ రెండు కాదు మొత్తం 13 బగ్స్ వెతికి లక్షలు సంపాదించాడు.

ఈ మధ్య గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ఓ బగ్ గుర్తించి రూ.7.6 లక్షల నజరానా అందుకున్నాడు. ఇక CVE-2019-2232 హ్యాకర్లకు సమాచారమందించేలా ఉందని గూగుల్ దృష్టికి తీస్కెళ్లడంతో గూగుల్ మాతకు ఇతడి మీద మంచి గురి గుదిరింది. దీనికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చాడు గూగుల్‌కి.. ఇది ఎవరి ఫోన్లనైనా క్రాష్ చేయగలదు. ఫోన్‌లోని ఆపరేటింగ్ సిస్టమ్ గుర్తించడంలో విఫలమవడమే కాకుండా, ఏకంగా ఫోనే క్రాష్ అవుతుందని తెలిపాడు.

ఎందుకంటే ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నిర్థిష్ట పరిమితి గల మెమరీ మాత్రమే ఉంటుంది. ఆ పరిమితి దాటితే సిస్టమ్ తట్టుకోలేదు అని ప్రతీష్ వివరించేసరికి గూగుల్ ప్రతినిధులు ఫ్లాటైపోయారు. వావ్.. ప్రతీష్ నీ తెలివి తేటలు అమోఘం అని అప్పటికప్పుడు రూ.10 వేల డాలర్లు రివార్డు ప్రకటించింది. ప్రతీష్ పని ఒక్క గూగుల్‌లో తప్పులు గుర్తించడమే కాదు, వాట్సాప్‌లో లోపాలు, మైక్రోసాప్ట్ గిట్ హబ్‌లోనూ లోపాలు గుర్తించాడు. తప్పులెంచడం అనేది చిన్న ఉద్యోగం కాదండి.. ఎదుటి వారి కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివి వుండాలి. బుర్ర నిండా తెలివి తేటలు ఉండాలి. అప్పుడే కాసులు కురుస్తాయి. ప్రతీష్ నారాయణ్‌కి ఈ ఉద్యోగం నచ్చి ఇందులోనే సెటిలైపోయాడు.

Next Story

RELATED STORIES