తాజా వార్తలు

ఉద్యోగులను తొలగించవద్దు : కేటీఆర్‌

ఉద్యోగులను తొలగించవద్దు : కేటీఆర్‌
X

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించవద్దని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చోరువ తీసుకోవాలని తెలిపారు. మీ ఉద్యోగుల పట్ల సానుభూతి చూపాలన్నారు. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ కంపెనీల అధినేతలకు కేటీఆర్‌ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ తర్వాత సిబ్బందిని తొలగించవద్దని లేఖలో మంత్రి కోరారు. ఉద్యోగాలు తీసివేయకుండా ఖర్చులు తగ్గించుకోవాలని కంపెనీలకు సూచించారు. లాక్‌డౌన్‌ తరువాత త్వరలోనే పరిశ్రమలు పుంజుకుంటాయని పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES