సీఎం యడియూరప్పకు కృతజ్ఞతలు: కుమారస్వామి

సీఎం యడియూరప్పకు కృతజ్ఞతలు: కుమారస్వామి
X

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. సీఎం యడియూరప్పకు కృతజ్ఞతలు తెలిపారు. కుమారస్వామి తన కుమారుడు నిఖిల్ కు శుక్రవారం వివాహం జరిపించడంతో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ నిబంధనలను పాటించకుండా.. కనీసం సామాజిక దూరం కూడా పాటించకుండా వివాహం జరిపించారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి అశ్వథ్ నారాయణ కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే..ఇదే అంశంపై స్పందించిన సీఎం యడ్యూరప్ప శనివారం కుమారస్వామి కుటుంబానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఈ పెళ్లిపై చర్చ అవసరంలేదని అన్నారు. చాలా సింపుల్ గా జరిగిందని.. ఆ విధంగా జరిపించినందుకు నేను అభిమానిస్తున్న అని యడియూరప్ప అన్నారు.

దీనిపై స్పందించిన కుమారస్వామి తమ ఇంట జరిగిన వివాహానికి సీఎం నుంచి మద్దతు లభించడం సంతోషమంటూ.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

RELATED STORIES