ఏటీఎం స్క్రీన్‌పై ఉమ్మిన గుర్తుతెలియని వ్యక్తి

ఓవైపు కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవడానికి లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నా.. కొందరు పోకిరీలు, ఆకతాయిలు మాత్రం రెచ్చిపోతున్నారు. జనాల్లో నిండిన కరోనా భయాన్ని అలుసుగా తీసుకుని వికృత చర్యలకు పాల్పడుతున్నారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి
ఏటీఎం స్క్రీన్‌పై ఉమ్మి వేశాడు. ఈ ఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది. అడ్డగుంటపల్లి చౌరస్తాలోని ఎస్‌బీఐ ఏటీఎం స్క్రీన్‌పై గుర్తుతెలియని వ్యక్తి ఉమ్మిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ ఖాతాదారులు విషయం తెలిసి ఆందోళనకు గురవుతున్నారు.
దీంతో నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బందితో కెమికల్ స్ప్రే చేయించారు. శుక్రవారం ఏటీఎం ముందు, ఏటీఎం లోపల కూడా పారిశుధ్య సిబ్బంది కెమికల్ స్ప్రే చేశారు. ఏటీఎం స్క్రీన్‌పై ఉమ్మిన వ్యక్తికోసం బ్యాంక్, పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com