తాజా వార్తలు

తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం!

తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం!
X

తెలంగాణలో రాగల మూడురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే సోమవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉత్తర జార్ఖండ్‌ నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురవచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Next Story

RELATED STORIES