ఆకుపచ్చని అడవుల్లో అరుదైన సర్పం..

ఆకుపచ్చని అడవుల్లో అరుదైన సర్పం..

ఓ భయంకరమైన విషసర్పం.. ఆకుల్లోని పచ్చదనాన్ని తన శరీరంలో ఇముడ్చుకుని అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో సంచరిస్తోంది. దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించి సలజర్స్ ఫిట్ వైపర్ అని పేరు పెట్టారు. ఈ పేరు హ్యారీపోర్టర్ సినిమాలోని ఓ క్యారెక్టర్‌కి ఉంటుంది. పాము కూడా ఆ క్యారెక్టర్‌కి దగ్గరగా ఉందని ఆ పేరు ఎంచుకున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఈ విష సర్పాన్ని మొదటగా గుర్తించింది బెంగళూరు నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్‌కు చెందిన జీసన్ ఏ అయాజ్ మిర్జా, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన హర్షల్ ఎస్ బోషలే, మరో ఇద్దరు కలిసి దీన్ని కనుగొన్నారు. ఏప్రిల్‌ విడుదలైన జూ సిస్టమాటిక్ అండ్ ఎవాల్యుయేషన్ మ్యాగజైన్‌లో ఈ పాముకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story