ఒంటరితనం ఎంత కష్టం.. భార్యా, పిల్లలు దూరంగా ఉండడంతో..

ఒంటరితనం ఎంత కష్టం.. భార్యా, పిల్లలు దూరంగా ఉండడంతో..
X

ఒంటరితనం.. ప్రియమైన వారిని బాగా గుర్తుచేస్తుంది. ఇంతకు ముందు చాలా సార్లు ఒంటరిగా ఉండ వలసి వచ్చినా.. ఇప్పుడు ఈ ఒంటరి తనం మరింత బాధిస్తుంది అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వాపోతున్నారు. సంజయ్ భార్య మాన్యతా దత్, పిల్లలు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. తను ఒక్కడే ముంబైలో ఉన్నాడు. లాక్డౌన్ కారణంగా వాళ్లు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు.

భార్య పిల్లలు దగ్గరలేదనే విషయం బాధించినా టెక్నాలజీ వల్ల వారిని రోజులో అనేక సార్లు చూస్తూ మాట్లాడగలుగుతున్నా. అందుకు టెక్నాలజీకి ధన్యవాదాలు చెప్పాలి అని సంజయ్ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌లో తెలిపారు. కరోనా మనకు జీవితం విలువని, ఒంటరి తనం బాధని తెలుపుతోంది. ప్రియమైన వారితో గడిపిన ఆనంద క్షణాలను గుర్తు చేస్తుంది. వాళ్లు అక్కడ సేఫ్‌గానే ఉన్నారని తెలిసినా మనసు ఆందోళన చెందుతూనే ఉంది అని సంజయ్ చెప్పారు.

Next Story

RELATED STORIES