మూడు వారాల తర్వాత భర్త వస్తే.. ఇంట్లోకి రానివ్వకుండా..

మూడు వారాల తర్వాత భర్త వస్తే.. ఇంట్లోకి రానివ్వకుండా..

మూడు వారాల తరువాత భర్త ఇంటికి వస్తే లోపలికి రానివ్వలేదు భార్య. నెల్లూరులో బంగారం పని చేస్తున్న ఓ వ్యక్తి బుధవారం వెంకటగిరి బంగారు పేటలో ఉన్న తన ఇంటికి వెళ్లాడు. కానీ భార్య అతడిని బయటే ఆపేసింది. కరోనా పరీక్షలు చేయించుకున్న తరువాతే లోపలికి రావాలని కండిషన్ పెట్టింది. మీతో పాటు, నేను, పిల్లలు మన చుట్టు పక్కల వాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు కరోనా టెస్ట్ చేయించుకుని రండి అని చెప్పి కోవిడ్ కేంద్రానికి పంపించింది.

వెంటనే వాలంటీరుకు ఫోన్ చేసి వారికి సమాచారం అందించింది. ఆమె నుంచి ఫోన్ కాల్ అందుకున్న వైద్య సిబ్బంది అతడిని ముందుగా క్వారంటైన్‌కు తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ అని వచ్చింది. దాంతో అతడిని ఇంటికి పంపించారు. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారంతా ఏదో ఒక విధంగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. దీంతో అధికారులకు తలనొప్పిగా మారింది. రానున్న నాులుగైదు రోజుల్లో ఇతర జిల్లాల నుంచి మరికొంత మంది వెంకటగిరి చేరుకుంటారని అధికారులకు సమాచారం అందింది.

Tags

Read MoreRead Less
Next Story