అహ్మద్‌నగర్‌ లో 29 మంది తబ్లిఘి జమాత్ సభ్యుల అరెస్ట్

అహ్మద్‌నగర్‌ లో  29 మంది తబ్లిఘి జమాత్ సభ్యుల అరెస్ట్
X

గత నెలలో ఢిల్లీలోని తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన 29 మందిని క్వారంటైన్ ముగిసిన అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు.. ఐదుగురు అనువాదకులు కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. ఇందులో ఐదుగురు విదేశీ పౌరులు కరోనా సోకిన వారు కూడా ఉన్నారు, ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. అహ్మద్‌నగర్‌లోని స్థానిక కోర్టు శనివారం విదేశీ పౌరులకు ఏప్రిల్ 24 వరకు రిమాండ్‌ విధించింది..

అంతకుముందు, థానే, నవీ ముంబై, అమరావతి, నాందేడ్, నాగ్‌పూర్, పూణే, అహ్మద్‌నగర్, చంద్రపూర్ మరియు గడ్చిరోలి, ముంబైతో సహా వీసా నిబంధనలను ఉల్లంఘించి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 156 మంది విదేశీ పౌరులపై కేసులు నమోదయ్యాయి. కాగా తాజాగా అరెస్టయిన 26 మంది విదేశీ పౌరులలో 8 మంది ఐవరీ కోస్ట్, 3 టాంజానియా, 4 ఇండోనేషియా , బ్రూనై దారుస్సలాం , జిబౌటి , ఇరాన్, బెనిన్ , ఘనా దేశాల నుండి ఒక్కొక్కరు ఉన్నారు.

Next Story

RELATED STORIES