దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎంతంటే..

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎంతంటే..

భారత్ లో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,116 కి చేరింది, ఇక కోవిడ్ -19 మరణాల సంఖ్య 519 కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకుని 2,302 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం 13,295 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, ఆదివారం రాత్రి 9 గంటల నాటికి, భారతదేశం మొత్తం 1,135 కొత్త పాజిటివ్ కోవిడ్ -19 కేసులను నివేదించింది.

ఇదిలావుంటే ఏప్రిల్ 20 అర్ధరాత్రి తరువాత భారతదేశంలోని నాన్-కంటైనర్ జోన్లకు సెలెక్టివ్ రిలాక్సేషన్లు ఇస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది, అయితే, కోవిడ్ -19 హాట్‌స్పాట్‌లుగా ప్రకటించిన జిల్లాల్లో కఠినమైన ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. మరోవైపు వలస కార్మికులను పునరావాస కేంద్రాల నుండి పని ప్రదేశాలకు వెళ్లొచ్చని.. వారిని తయారీ యూనిట్లు, పొలాలు వంటి ప్రాంతాలకు సోమవారం నుండి అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఏ రాష్ట్రంలో ఉన్నవారిని ఆ రాష్ట్రంలోనే ఉంచాలని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story