భారత్ లో 17వేలు దాటిన కరోనా కేసులు

భారత్ లో 17వేలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 1553 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే మొత్తం 543 మరణాలు భారత్ లో సంభవించాయని.. కేసుల సంఖ్య 17,265 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క కోవిడ్ -19 డాష్‌బోర్డ్ ప్రకారం, 2547 మందికి నయం కావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 14,175 క్రియాశీల కేసులు ఉన్నాయి.. ఇక రాష్ట్రవ్యాప్తంగా 4203 కోవిడ్ -19 కేసులు, 223 మరణాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

ఇక్కడ మొత్తం 507 మందిని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ సమాచారం. మహారాష్ట్ర తరువాత, 2000 కేసులతో దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉంది.. ఇక్కడ 72 డిశ్చార్జ్ మంది డిశ్చార్జ్ అయ్యారు.. అలాగే 45 మరణించారు. ఆ తరువాత గుజరాత్ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది.. ఇక్కడ ప్రస్తుతం 1911 పాజిటివ్ కేసులు ఉన్నాయి, వీటిలో 105 మంది డిశ్చార్జ్ అయ్యారు. 63 మంది మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story