26 జిల్లాల్లో ఎంపిక చేసిన జోన్లలో పారిశ్రామిక కార్యకలాపాలు : మహారాష్ట్ర సీఎం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏప్రిల్ 20 నుంచి 26 జిల్లాల్లో ఎంపిక చేసిన జోన్లలో పారిశ్రామిక కార్యకలాపాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ జిల్లాల్లో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 66 వేల 896 పరీక్షలు జరిగాయని, అందులో 95% ప్రతికూలంగా ఉన్నాయని ఆయన తెలియజేశారు.
రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన ఏ పని కూడా ఆపబడదని, అయితే రాష్ట్రాల సరిహద్దు ఆంక్షలు అలాగే ఉంటాయని చెప్పారు. నగరాల సరిహద్దులు కూడా మూసివేయబడతాయని అన్నారు. అంతేకాదు పనిచేసే ఉద్యోగులు, కూలీలకు కూడా సరైన ఏర్పాట్లు చేయాలని పారిశ్రామికవేత్తలతో మాట్లాడామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని కూలీలందరికీ ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. వలస కూలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుతోందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com