ఢిల్లీలో కరోనా కట్టడికి 40,000 ర్యాపిడ్ పరీక్షలు

ఢిల్లీలో కరోనా కట్టడికి  40,000 ర్యాపిడ్ పరీక్షలు
X

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలోని 79 కంటైనర్ జోన్లలో రాబోయే 3-4 రోజులలో 40,000 ర్యాపిడ్ పరీక్షలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 25 ఖైదీల వ్యాన్లను ఉపయోగించాలని ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ఆదేశించింది.

కాగా శనివారం కరోనా బారిన పడిన 186 మందికి ఎటువంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ అని తేలింది. దాంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.. ఇది తెలియకుండానే ఇతరులకు సోకుతుందనే అనుమానాలకు బలం చేకూర్చింది.. ఈ క్రమంలో ర్యాపిడ్ పరీక్షలు అవసరమని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story

RELATED STORIES