Top

అక్షయ‌పై సిన్హా విమర్శలు.. నెటిజన్ల చేతిలో చీవాట్లు

అక్షయ‌పై సిన్హా విమర్శలు.. నెటిజన్ల చేతిలో చీవాట్లు
X

సాయం ఎంత చేసేది ఎందుకు చెప్పాలి.. మాకెంత అవమానంగా ఉంటుంది. మేమంత ఇవ్వలేకపోతున్నాం అన్న ఫీలింగ్ ఒక పక్క.. ఆయన మాత్రం అంత ఇచ్చి తానే గొప్ప హీరో అని అనిపించుకున్నాడని మరోపక్క.. అని బాలీవుడ్ సీనియర్ నటుడు శ్రతృఘ్నసిన్హా అక్షయ్ కుమార్ మీద తనకు ఉన్న ఈర్ష్యా, అసూయలను వెళ్లగక్కుతున్నాడు. కోవిడ్ బాధితుల సహాయార్థం పీఎం కేర్ ఫండ్‌‌కి అక్షయ్ రూ.25 కోట్లు ఇచ్చిన నేపథ్యంలో సిన్హా ఈ విధంగా మాట్లాడారు. అలాగే ముంబై మున్సిపల్ కార్మికులకు మళ్లీ రూ.3 కోట్లు ఇచ్చి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు అక్షయ్.

అదే ఇప్పుడు సిన్హా ఈర్ష్యకు కారణమైంది. ఇస్తే ఇచ్చుకో కానీ ఇంత పబ్లిసిటీ అవసరమా అనేది ఆయన అభిప్రాయం. అయితే సిన్హా వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. దీంతో వెంటనే తన వాఖ్యలను సవరించుకుంటూ అక్షయ్‌ని విమర్శించే ఉద్దేశం తనకు లేదని.. ఆయన నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని తప్పుని సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సహాయం చేయడానికి అక్షయ్ ఎప్పుడూ ముందు ఉంటాడని పొగడలేక పొగుడుతున్నాడు. ఆనక ఎరక్క పోయి ఇరుక్కు పోయాను అని నాలుక కొరుక్కుంటున్నాడు.

Next Story

RELATED STORIES