యోగి ఆదిత్యనాథ్ తండ్రి మరణం.. అంత్యక్రియలకు హాజరు కాలేనన్న సీఎం

X
TV5 Telugu20 April 2020 4:45 PM GMT
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ అనారోగ్యం కారణంగా కన్ను మూసారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను మార్చి 13న న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయనను బ్రతికించేందుకు డాక్టర్లు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. ఆనంద్‌సింగ్ గతంలో ఉత్తరాఖండ్ అటవీశాఖలో రేంజర్‌గా పనిచేసేవారు. ఆయన వయసు 89 సంవత్సరాలు.
తండ్రి మరణంపై స్పందించిన సీఎం యోగి.. కరోనా కారణంగా అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని ప్రకటించారు. తన తండ్రి కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోతున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story