అంతర్జాతీయం

ఆదివారం 6,463 మంది మరణించారు : who

ఆదివారం 6,463 మంది మరణించారు : who
X

ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 81 వేల 153 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించబడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. అలాగే 6,463 మంది మరణించారు. శనివారం కంటే ఆదివారం తక్కువ కేసులు నమోదయ్యాయి. మునుపటి రోజులతో పోలిస్తే నాలుగు వేల తక్కువ కేసులు, 247 తక్కువ మరణాలు నమోదయ్యాయి. WHO ప్రకారం, ఐరోపాలో 1.1 మిలియన్లకు పైగా ప్రజలు వైరస్ సంక్రమణ భారిన పడ్డారు.

అదే సమయంలో, ఇక్కడ మరణాల సంఖ్య కూడా లక్షకు మించిపోయింది. కాగా WHO చీఫ్ టెడ్రోస్ అధోనమ్ గెబ్రేసియస్ జి 20 ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కరోనాతో పోరాడుతున్న దేశాలకు సహాయం చేయాలని ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story

RELATED STORIES