మా రాష్ట్రంలో కరోనా లేదు : సీఎం ప్రకటన

మా రాష్ట్రంలో కరోనా లేదు : సీఎం ప్రకటన
X

గోవా తర్వాత మరో రాష్ట్రం కరోనా మహమ్మారి నుంచి బయటపడింది. తమ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా కొత్తవి నమోదు కాలేదని మణిపూర్‌ ప్రకటన చేసింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. మణిపూర్ ఇప్పుడు కరోనా ఫ్రీ అని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొదటినుంచి ఇక్కడ ఇద్దరు రోగులు ఉన్నారు, ప్రస్తుతం ఈ ఇద్దరూ పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా సంక్రమణ కేసులు లేవు అని వెల్లడించారు.

కాగా, గ్రామీణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సడలించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఇంఫాల్‌లో మాత్రం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలావుంటే గోవాకు కూడా ఆదివారం విముక్తి లభించిన సంగతి తెలిసిందే. ఇక్కడ చేరిన మొత్తం 7 మంది రోగులు చికిత్స తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Next Story

RELATED STORIES