Top

తమిళ్ స్టార్ బైక్ రైడింగ్.. హైదరాబాద్ టూ చెన్నై.. ప్లైట్ టికెట్ క్యాన్సిల్

తమిళ్ స్టార్ బైక్ రైడింగ్.. హైదరాబాద్ టూ చెన్నై.. ప్లైట్ టికెట్ క్యాన్సిల్
X

హైదరాబాద్‌లో తమిళ చిత్రం వాలిమై షూటింగ్ జరుగుతోంది. అందులో బైక్ రైడింగ్ సన్నివేశాలు ఉంటాయి. అసలే బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం ఆ చిత్రంలో నటిస్తున్న అజిత్‌కి. అందులోనూ ప్రత్యేకంగా తనకోసమే డిజైన్ చేసిన బైక్. చూస్తే మనసు ఆగట్లేదు. ఇంతలో లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. చిత్ర యూనిట్ ప్యాకప్ చెప్పేసి చెన్నై ప్లైట్ ఎక్కేద్దామనుకున్నారు. కానీ హీరో అజిత్ మాత్రం నా ఫ్లైట్ టిక్కెట్ క్యాన్సిల్ చేయించండి. నేను నై బైక్‌పై వస్తాను అని చెప్పారట. దీంతో అసిస్టెంట్ ఫైట్‌లో చెన్నై వెళితే.. అజిత్ మాత్రం 650 కిలోమీటర్లు బైక్‌పై వెళ్లి తన ముచ్చట తీర్చుకున్నారు.

బైక్‌ రేసుల్లో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఆ స్వీట్ మెమరీస్‌ని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుని 650 కిలోమీటర్లను అవలీలగా పూర్తి చేశారు. చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా, వాలిమై చిత్రం హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతోంది. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక అజిత్ పక్కన హీరోయిన్‌గా హ్యుమా ఖురేషీ నటిస్తోంది.

Next Story

RELATED STORIES