కరోనా వైరస్‌ని 1964లోనే ఓ లేడీ డాక్టర్.. ..

కరోనా వైరస్‌ని 1964లోనే ఓ లేడీ డాక్టర్.. ..

ప్రపంచాన్ని ఓ పెనుభూతంలా పట్టి పీడిస్తున్న కరోనా.. మనం అనుకుంటున్నట్లు ఆరు నెలల క్రితం పుట్టింది కాదు.. 60 ఏళ్ల క్రితమే ఈ కరోనా డాక్టర్ జూన్ అల్మీడా కంటికి చిక్కింది. 1964లో లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్ లేబరేటరీలో ఆమె ఈ వైరస్‌ను గుర్తించారు.

ఓ బస్ డ్రైవర్ కూతురైన అల్మీడా 1930లో పుట్టారు. స్కూల్ చదువు పూర్తి చేసిన తరువాత పై చదువులపై దృష్టి సారించలేదు. చదువు ఆపేసి అక్కడే ఉన్న గ్లాస్గో రాయల్ ఇన్ఫర్మరీ ల్యాబరేటరీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగం సంపాదించుకున్నారు. ఉద్యోగంపై మక్కువ, కొత్తగా ఇంకేదైనా నేర్చుకోవాలన్న కుతూహలంతో లండన్‌కు మకాం మార్చారు అల్మిడా. అక్కడే వెనిజులాకు చెందిన ఆర్టిసట్ ఎన్నకెస్‌ను పెళ్లి చేసుకున్నారు. పాప పుట్టిన తరువాత అల్మీడా కుటుంబం కెనడాలోని టరెంటుకు షిప్ట్ అయ్యారు.

అక్కడే ఉన్న ఒంటారియో కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయి ఎలక్టాన్ మైక్రోస్కోప్ విభాగంలో మంచి నైపుణ్యం సంపాదించారు. యాంటీబాడీలను ఉపయోగించి వైరస్‌లను మరింత పెద్దవిగా, క్లియర్‌గా చూసే విధానాన్ని ఆమె అభివృద్ధి చేశారు. తన పరిశోధనలకు గాను డాక్టరేట్ సంపాదించుకున్నారు. అల్మిడా ప్రతిభను గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం ఆమెను తిరిగి తమ దేశానికి వచ్చేయమని అభ్యర్థించింది. ఈ క్రమంలోనే అల్మిడా లండన్ లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌‌కు చెందిన మెడికల్ స్కూల్‌లో విధులు నిర్వర్తించారు.

ఇక్కడే డాక్టర్ డేవిడ్ టిరెల్‌తో కలిసి సాధారణ జలుబుకు కారకమయ్యే వైరస్‌లను గురించి అధ్యయం చేశారు. ఇందుకోసం వాలంటీర్లను నియమించి వారి నుంచి నమూనాలను సేకరించారు. ఇందులో ఒక విద్యార్థికి చెందిన బీ 814 నమూనాలోని వైరస్ గురించి డాక్టర్ టిరెల్‌కు అంతు చిక్కలేదు. అయితే వాటిని అల్మీడా పరిశీలించి ఇందులో ఇన్‌ప్లూయెన్జా తరహా వైరస్ లక్షణాలున్నాయని తేల్చారు. అలా ఆమె గుర్తించిన వైరస్‌కి కరోనా అని పేరు పెట్టారు. మనుషులకు సోకిన మొట్టమొదటి కరోనా వైరస్ అది.

ఈ వివరాలన్నీ 1965లో వచ్చిన బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా అప్పుడు పుట్టిందే. కాగా, ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ కరోనా బారిన పడితే సెయింట్ థామస్ హాస్పిటల్‌లోనే చికిత్స తీసుకుని కోలుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story