కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ట్రంప్ కీలక నిర్ణయం

X
TV5 Telugu21 April 2020 10:38 AM GMT
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేసే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో.. "అదృశ్య శత్రువు నుండి దాడి, అలాగే మా గొప్ప అమెరికన్ పౌరుల ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరం ఉన్నందున,
అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయడానికి నేను ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేయబోతున్నాను" అని ట్రంప్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా రాయిటర్స్ లెక్కల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ధృవీకరించబడిన కరోనావైరస్ కేసులు 774,000 ఉన్నాయి.
Next Story