సమాధానం చెప్పకపోతే.. మీకు సహకరించం: మమతా బెనర్జీ

సమాధానం చెప్పకపోతే.. మీకు సహకరించం: మమతా బెనర్జీ

కేంద్ర ప్రభుత్వ చర్యలపై.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. కేంద్ర బలగాలను.. రాష్ట్రంలోకి ఎందుకు పంపించారో ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా వివరించాలని డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనలను పరిశీలించేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రంలోకి వచ్చాయని.. అయితే.. తమకు వివరణ ఇచ్చేవరకూ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సహకరించమని ఆమె స్పష్టం చేశారు.

కరోనా విషయంలో కేంద్రం చేస్తున్న సూచనలును తాము స్వాగతిస్తామని.. పలు రాష్ట్రాలకు కేంద్ర బలగాలను ఎందుకు పంపిస్తున్నారో అర్ధంకావటం లేదని అన్నారు. దీనిపై స్పందించి.. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా వివరణ ఇవ్వాలని అన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ట్వీట్ చేశారు.

అటు ఇదే అంశంపై స్పందించిన బెంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ సిన్హా.. కేంద్ర బలగాలు రాష్ట్రాలకు రావడానికి 15 నిముషాల ముందు మాత్రమే సమాచారం అందించారని అన్నారు. కేంద్ర బలగాల పర్యటన గురించి మాకు చెప్పారు.. కానీ తమను అడగలేదని అన్నారు. మాతో కలిసి మాట్లాడిన తరువాతే వారి పర్యటనను అంగీకరిస్తాం. లేని యడల వారిని పర్యటించనీయమని అన్నారు.

అయితే.. దేశంలో కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తమకు నివేదికలు అందాయని కేంద్రం ముందుగానే ప్రకటించింది.

ముంబయి, పుణె, ఇండోర్‌, కోల్‌కతా, బెంగాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఆ ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ఉల్లంఘనతో పాటు.. అల్లర్లు జరిగాయని.. అందుకే అక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని కేంద్రం ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story