Top

కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమం!
X

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ ఆరోగ్యం తీవ్రంగా విషమించినట్లు పలు ఆంగ్ల వెబ్ సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. సోమవారం రాత్రి సమయంలో కిమ్ తీవ్ర అస్వస్థత గురైనట్లు కథనాల సారాంశం. ప్రస్తుతం కిమ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్ర అనారోగ్యం కారణంగానే ఉత్తర కొరియాలో జరుగుతున్న ఆయన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్‌ హాజరు కాలేదని తెలుస్తోంది. కిమ్ ఆరోగ్యం విషమించిందని వార్తలు రాగానే ప్రపంచం మొత్తం ఈ విషయాన్నీ ఆరా తీస్తోంది.

ఇటీవలే కిమ్‌ తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని.. కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఆయనకు శస్త్రచికిత్స కూడా నిర్వహించారు. మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం గురించి అమెరికా వివరాలు కోరుతున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. కాగా ప్రపంచం మొత్తం కరోనావైరస్ తో పోరాడుతుంటే కిమ్ మాత్రం క్షిపణి పరీక్షలు చేస్తున్నారని కథనాల వచ్చిన సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES