దక్షిణ కాశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల ఏరివేత

X
TV5 Telugu22 April 2020 12:45 PM GMT
దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్‌లో భారత భద్రతా దళాలు ఉగ్రవాదులపై విరుచుకుపడ్డాయి. బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టింది. మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు మల్హురా జనపోరా గ్రామంలో దాక్కున్నట్లు.. తమకు సమాచారం అందినట్లు ఆర్మీ, స్థానిక పోలీసులు తెలిపారు.
దాంతో సంయుక్త ఆపరేషన్ చేపట్టి.. నలుగురు ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేసినట్టు తెలిపారు.. ప్రస్తుతం ఆపరేషన్ ముగిసిందని పోలీసులు తెలిపారు. కాగా ఏప్రిల్‌లో ఇప్పటివరకు నాలుగు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
Next Story