చైనాలో కొత్తగా 30 కరోనా కేసులు

చైనాలో కొత్తగా 30 కరోనా కేసులు

చైనాలో మరో 30 కొత్త కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే 82 వేలకు పైగా కేసులు నమోదయ్యాయిన చైనాలో రికార్డుస్థాయిలో 77 వేల మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4 వేల పైచిలుకు మరణాలు చైనాలో సంభవించాయి. తాజాగా నమోదైన ఈ కేసులలో 23 విదేశాల నుంచి వచ్చిన వారికి నమోదైనట్టు చైనా హెల్త్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం వెల్లడించింది. అయితే ఏడు కేసులు మాత్రం స్థానికంగానే నమోదైనట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.

గత రెండు రోజుల నుంచి చైనాలో మరణం కూడా నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. ఇదిలావుంటే చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మంగళవారం షాంకి ప్రావిన్స్‌కు దక్షిణంగా ఉన్న చిన్మి గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో 188 పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడ పరిస్థితులను, వారి జీవన విధానాలను అడిగి తెలుసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story