ఆ దేశంలో లాక్డౌన్.. మూడు రోజులు ఆడవారు.. మూడు రోజులు మగవారు..

ఆ దేశంలో లాక్డౌన్.. మూడు రోజులు ఆడవారు.. మూడు రోజులు మగవారు..

కరోనా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందో అర్ధం కావట్లేదు. కనీసం కొన్ని రోజలైనా సామాజిక దూరం పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని అంచనాకు వచ్చిన దేశాలు చాలా వరకు లాక్డౌన్ విధించి జన జీవనాన్ని స్థంభింపజేశారు. కొన్ని దేశాలు కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు పరుస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవాలంటే కష్టమని పరిమితులతో కూడిన లాక్డౌన్‌లు అమలుపరుస్తున్నాయి. మరి ఏ దేశంలో ఎలా వుందో ఒకసారి చూద్దాం..

చిలీ ప్రభుత్వం కోవిడ్ నుంచి కోలుకున్న వారికి డిజిటల్ ఇమ్యూనిటీ కార్టులు జారీ చేస్తోంది. పాజిటివ్ వచ్చి 14 రోజుల క్వారంటైన్ తరువాత కోలుకున్న వ్యక్తులకు ఈ కార్డులు జారీ చేస్తారు. వీరికి లాక్డౌన్ పరిమితులు వర్తించవు. వారి కార్యకలాపాలు యధావిధిగా నిర్వర్తించుకోవచ్చు. యూకే, అమెరికాల్లో ఇలాంటి కార్డులు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. పెరూలో అయితే సోమ, బుధ,శుక్రవారాల్లో పురుషులను, మంగళ,గురు, శనివారాల్లో స్త్రీలను బయటకు అనుమతిస్తున్నారు.

పనామా సిటీ, కొలంబియాల్లో కూడా ఈ విధంగానే చేస్తున్నారు. ఇక డెన్మార్క్‌లో అయితే విద్యార్ధుల కోసం బడులు తెరిచారు. అయితే పిల్లలు కచ్చితంగా 2 మీటర్ల దూరం పాటించడం, 2 గంటలకోసారి చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. స్కూళ్లలో టాయ్‌లెట్లు, డోర్ హ్యాండిల్స్ రోజుకి రెండు సార్లు శానిటైజ్ చేస్తున్నారు. చెక్ రిపబ్లిక్‌లో కూడా విద్యార్ధులకు కాలేజీలు, యూనివర్సిటీలు ప్రారంభమయ్యాయి. టర్కీ, స్వీడన్‌లో అయితే వయసును బట్టి లాక్డౌన్ మినహాయింపు.. 70 ఏళ్ల వయసు వాళ్లు ఎట్టిపరిస్థితిలోనూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు.

ఇటలీలో అయితే డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. ఎవరైనా బయటకు వచ్చారంటే అయిపోయారే. యూకే కూడా ఇదే పద్దతి అనుసరిస్తోంది. ఆస్ట్రేలియాలో అయితే డ్రోన్ కెమెరా ద్వారా ఎవరైనా బయట దగ్గినా, తుమ్మినా పట్టుకుపోతున్నారు. చైనా, కువైట్‌లు మరింత ముందుకెళ్లి టాకింగ్ డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. ఎక్కువ సేపు బయట తిరిగితే.. ఇంకెంత సేపు వెళ్లు ఇంటికి అని అమ్మలా ఆప్యాయంగా, నాన్నలా కోపంగా హెచ్చరిస్తుంది. టర్కీ ప్రభుత్వం వారానికి రెండు రోజులు లాక్డౌన్ అమలు చేస్తోంది. మిగతా రోజుల్లో కూడా చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు ఇంటి పట్టునే ఉండాలి. అరిజోనాలో కూడా వీకెండ్ సెలవులాగా వీకెండ్ లాక్డౌన్ అమలు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story