వాళ్లు డాక్టర్లు కాదు.. దేవుళ్లు: కోలుకున్న వ్యక్తి భావోద్వేగం

వాళ్లు డాక్టర్లు కాదు.. దేవుళ్లు: కోలుకున్న వ్యక్తి భావోద్వేగం

మనుషులందరికీ ఒక పరీక్ష పెట్టడానికే మహమ్మారి కరోనా మన మీదకు దాడి చేస్తుందేమో. మనుషుల్లో మంచి, మానవత్వం ఇంకా మిగిలే వున్నాయని రుజువు చేస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాణాంతక మహమ్మారి బారిన పడిన వారికి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి, అందుకు సహకరిస్తున్న పోలీసు సిబ్బందికి చేతులెత్తి దండం పెట్టినా సరిపోదు. ఏమిచ్చి తీర్చుకోగలను వారి రుణం అని కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి భావోద్వేగానికి గురయ్యాడు.

ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన బాధితుడు.. తాను మంగళూరులోని వెన్‌లాక్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందాను. ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. మంచిగా మాట్లాడుతూ.. నాలో ధైర్యం నింపారు. ఆస్పత్రి సిబ్బంది రోగులకు ఏది కావాలంటే అది సమకూరుస్తున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులను కాపాడుతున్న డాక్టర్లకు, నర్సులకు రుణపడి ఉంటాం అని కన్నీటి పర్యంతం అయ్యాడు.

ఈ వీడియోను సీసీ హర్ష ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కరోనా బాధితుడి మాటలను ప్రతి ఒక్కరూ వినాలి. తమ సిబ్బందితో పాటు, వైద్య సిబ్బంది రోగులను ఎంత బాగా చూసుకుంటున్నారో అతడి మాటలు వింటే మీకే తెలుస్తుందని అన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story