మిలిట‌రీ శాటిలైట్‌ను విజయవంతంగా క‌క్ష్య‌లోకి పంపిన ఇరాన్‌

మిలిట‌రీ శాటిలైట్‌ను విజయవంతంగా క‌క్ష్య‌లోకి పంపిన ఇరాన్‌
X

మిలిట‌రీ శాటిలైట్‌ను ఇరాన్ విజ‌య‌వంతంగా కక్ష్యలోకి పంపింది. ఈ శాటిలైట్‌ను ఇరాన్స్ రెవల్యూషనరీ గార్డ్స్ సక్సెస్‌పుల్ గా ప్రయోగించారు. టూ స్టేజ్ కెరీర్ లాంచ‌ర్‌ నుంచి నూర్ శాటిలైట్‌ను నింగికి పంపిన‌ట్లు ఐఆర్జీసీ పేర్కొన్న‌ది.

మ‌ర్కాజీ ఎడారి నుంచి ప్ర‌స్తుత నూర్ ఉప‌గ్ర‌హాన్ని లాంచ్ చేశారు. 425 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న భూక‌క్ష్య‌లో శాటిలైట్‌ను ప్లేస్ చేశారు. రెండు నెల‌ల క్రిత‌మే ఓ శాటిలైట్‌ను ప్ర‌యోగించినా అది విజయవంతం కాలేదు. దీంతో ఇరాన్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే మ‌రో ప‌రీక్ష‌ను చేప‌ట్టింది.

Tags

Next Story