కేరళలో దారుణం.. 16 ఏళ్ల యువకుడిని హత్య చేసి..

కేరళలో దారుణం.. 16 ఏళ్ల యువకుడిని హత్య చేసి..
X

కేరళలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల యువకుడిని కిరాతకంగా హతమార్చారు. మృతదేహం రబ్బరు తోటలో లభ్యమైంది. అతన్ని స్నేహితులే హత్య చేసి కాల్చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన ఆదివారం కొడుమాన్ ప్రాంతంలో జరిగింది.. కానీ ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పతనమిట్ట జిల్లా అంగడిక్కల్ కు చెందిన అఖిల్ ను అతని క్లాస్‌మేట్స్ గొడ్డలితో నరికి చంపారని.. ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతని ఇద్దరు మిత్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఆట సమయంలో వివాదం అఖిల్ హత్యకు దారితీసిందని పోలీసులు చెబుతున్నా.. మరొక కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES