20 రోజుల్లో 1500 పడకల ఆసుపత్రి 'టిమ్స్'

20 రోజుల్లో 1500 పడకల ఆసుపత్రి టిమ్స్
X

గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) హాస్పిటల్‌గా రూపుదిద్దుకుంది. కోవిడ్ బాధితులకు సేవలందించేందుకు గాను అత్యవసరంగా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 13 అంతస్థుల భవనంలో 1500 పడకలతో అధునాతన వైద్య సౌకర్యాలందించేందుకు ఆసుపత్రి సిద్ధమైంది. 20 రోజుల వ్యవధిలో హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఆయన టీమ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రస్తుతానికి కోవిడ్ బాధితులకు చికిత్స అందించినా తరువాతి కాలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చి వైద్య సేవలు, పరిశోధనలు సాగించేందుకు వినియోగిస్తామని మంత్రి వెల్లడించారు.

Next Story

RELATED STORIES