వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. ఓలుక్కేయండి..

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. ఓలుక్కేయండి..

పొద్దున్న లేవగానే పక్కింటి వాళ్లు పలకరించకపోయినా వాట్సాప్‌లో గుడ్‌మార్నింగ్‌ల పరంపర కొనసాగుతుంది. ఉన్న ఫీచర్లతోనే ఒక్క క్షణం తీరికలేకున్న వాట్సప్ ప్రేమికుల కోసం మరికొన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయనే శుభవార్తని అందిస్తోంది యాజమాన్యం.

బ్యాకప్‌కి రక్షణ

ఇప్పటి వరకు మీ ఫ్రండ్‌కో, మీ ఫియాన్సీకో చేసిన ఛాట్ హిస్టరీ, ఫోటోలు, వీడియోలు గట్రా అంతా గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ అవుతోంది. దీనికి ఎలాంటి సెక్యూరిటీ ఆప్షన్లేదు ఇప్పటి వరకు. అందుకే అవన్నీ భద్రంగా దాచి పెట్టుకోవడానికి రక్షణ కల్పించాలనుకుంటోంది వాట్సప్. దానికో పాస్‌వర్డ్ పెట్టుకుంటే ఎవ్వరూ చూడరు.

సెర్చింగ్ చాలా ఈజీగా

గ్రూపులు ఎక్కువయ్యాయి. కాంటాక్ట్‌లూ పెరిగిపోయాయి. వీటన్నిటి మధ్యలో పాత ఇమేజ్, పీడీఎఫ్‌లు వెతకాలంటే ఎంత కష్టం. అందుకే ఓ ఫీచర్‌‌ను తీసుకొస్తోంది. దీనికో ఫైల్ మేనేజర్‌ను పెట్టి అందులోనే అన్ని ఉండేలా చూస్తోంది. మీ పని ఇంకా ఈజీ అయ్యేందుకు ఒక్కో ఫైల్‌కు ఒక్కో కలర్ కూడా ఇస్తున్నారు.

గ్రూప్ కాల్స్ లిమిట్

ఇప్పటి వరకు 4 గురితో మాత్రమే గ్రూప్ కాలింగ్ ఉండేది. ఇకపై ఎనిమిది మందితో కూడా చేసుకోవచ్చు.

మల్టిపుల్ డివైజ్ సపోర్ట్

ఒకే నెంబరుతో రెండు మొబైల్స్‌లో వాట్సప్ వాడుకోవచ్చు.

ఫోన్ లేకుండా వాట్సాప్ వెబ్

చేతిలో మొబైల్ ఉంటేనే వాట్సాప్ వెబ్ వాడడానికి వీలవుతుంది. ఇకపై మొబైల్‌తో పన్లేదు. యూనివర్సల్ విండోస్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా వాట్సాప్ వెబ్ పని చేసేలా మార్పులు చేస్తున్నారు.

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఉన్న సీక్రెట్ కన్వర్జేషన్ ఫీచర్ ఇకనుంచి వాట్సాప్‌లోకి కూడా వచ్చేస్తుంది.

నకిలీ వార్తలు, నకిలీ ఫోటోలు నమ్మాలో లేదో తెలియదు.. ఫలనా చోట అలా జరిగింది.. ఇలా జరిగింది అంటూ రోజూ వచ్చే వాటిని కంట్రోల్ చేస్తుంది. అది నిజమో కాదో అక్కడే ఉన్న గూగుల్ సెర్చ్ ఐకాన్ ద్వారా నిర్దారించుకోవచ్చు.

వాట్పాప్‌లోనే బ్రౌజర్.. ఇప్పటిదాకా వాట్సాప్‌లో వచ్చే వార్తలు, వెబ్ సైట్ లింక్‌లను క్లిక్ చేస్తే వేరే బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇకపై వాట్సాప్‌లోనే ఆ పేజ్‌ ఓపెన్ అవుతుంది. దీనికోసం యాప్ బ్రౌజింగ్ ఆప్షన్ వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story