ఈపీఎఫ్‌ఓ నుంచి భారీగా అడ్వాన్స్ లు..

ఈపీఎఫ్‌ఓ నుంచి భారీగా అడ్వాన్స్ లు..
X

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కునే ఉద్యోగులకు అడ్వాన్స్ పేమెంట్ ను ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) ప్యాకేజీలో భాగంగా ఈపీఎఫ్‌ పథకం నుంచి ప్రత్యేక ఉపసంహరణకు ప్రభుత్వం వీలుకల్పించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం రూ .3,601 కోట్లను సెటిల్ చేసినట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది.

దాదాపు 90 శాతం ముందస్తు చెల్లింపులను కేవలం మూడు రోజుల్లోనే చేశామని.. దేశవ్యాప్తంగా 10.02 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు ఈపీఎఫ్‌ఓ బుధవారం తెలిపింది. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఇది ఉపయోగపడుతుందని ఈపీఎఫ్‌ఓ అభిప్రాయపడింది. మరోవైపు క్లెయిమ్ లలో రూ .1,954 కోట్ల కోవిడ్ క్లెయిమ్‌లు ఉన్నట్టు తెలిపింది. కాగా మొత్తం ఖాతానుంచి గరిష్టంగా 75 శాతం అడ్వాన్స్ ను ఉపసంహరించుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

Next Story

RELATED STORIES