పిల్లలిద్దరికీ బోన్ మ్యారో.. బతికించుకోవడానికి మీ వంతు సాయం..

పిల్లలిద్దరికీ బోన్ మ్యారో.. బతికించుకోవడానికి మీ వంతు సాయం..

పుట్టిన ఇద్దరు పిల్లలకీ అనారోగ్యం. మందేస్తే తగ్గిపోయేదో.. మంచి హాస్పిటల్‌కి తీసెకెళ్తే నయిమయ్యేదో కాదు. వ్యాధి వచ్చిన పిల్లలతో పాటు కడుపులోపెట్టి చూసుకుంటున్న కన్నవారికి నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. పగవాడికి కూడా రాకూడని ఓ భయంకరమైన వ్యాధి బోన్ మ్యారో. ఈ వ్యాధికి వైద్యం చాలా ఖరీదుతో కూడుకున్నది. పిల్లలకి ఎప్పుడూ బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి. బెంగళూరులో నివసిస్తున్న గ్రాఫిక్ డిజైనర్‌ సుధాకర్‌కి ఇద్దరు పిల్లలు.. కొడుకు రేవంత్ (12), కూతురు శర్వాణి (6). పుట్టుకతోనే ఇద్దరికీ బోన్ మ్యారో జబ్బు చేసింది. ఒకరు కాకపోతే ఒకరైనా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటే కొంతైనా కన్నవాళ్ల బాధ తీరేది. కానీ ఇద్దరూ ఒకే జబ్బుతో బాధపడుతున్నారు. ఆ వచ్చిన జబ్బు కూడా వందలు, వేలతో తగ్గేది కాదు. లక్షలతో పని. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. చూస్తూ చూస్తూ పిల్లల్ని అలా వదిలేయక, డబ్బు సమకూరే మార్గం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు సుధాకర్. స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఇప్పటి వరకు లక్షా 50 వేలు ఖర్చు పెట్టారు. మరో నెల రోజుల్లో 40 లక్షలు సమకూర్చుకుంటే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాన్‌టేషన్ చేస్తామని చెప్పారు డాక్టర్లు. వచ్చే జీతం ఇద్దరు పిల్లల మందులకి, ఇల్లు గడవడానికే సరిపోతుంది. అంత డబ్బు ఎలా తెచ్చేది అని సుధాకర్ ఆందోళన చెందుతున్నారు. ఆర్ధిక సహాయం కోసం అర్థిస్తున్నారు. మానవత్వం ఉన్న మంచి మనుషులు ఎవరైనా ముందుకొచ్చి తోచిన సహాయం చేసి తన పిల్లల ప్రాణాలు కాపాడమని వేడుకుంటున్నారు. దాతలెవరైనా డబ్బు పంపించదలిస్తే ఈ అకౌంట్‌ నెంబర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయగలరు.

Account number: 2223330032554501

Account name: sudhakar kvk

IFSC code: RATN0VAAPIS

పేటీఎం ద్వారా లేదా UPI యాప్ ద్వారా కూడా పంపించవచ్చు.

To pay via Paytm (for Android users only) - http://m.p-y.tm/pay-milaap?comment=originId_162077&amount=2500&amount_editable=1

------------------------------------

For UPI payment: rzpy.givetomlpsudhaka0008@hdfcbank https://milaap.org/fundraisers/support-sudhakar-kvk/upi_deeplink (You can send money to this ID using BHIM, PhonePe or any UPI app)

Tags

Read MoreRead Less
Next Story