అర్నబ్ గోస్వామిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్

అర్నబ్ గోస్వామిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్
X

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై జరిగిన దాడి అంశంపై దేశవ్యాప్తంగా చర్చకు వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనపై చర్యలు తీసుకుపోవాలని డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు.. కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ప్రసార నియమాలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తించారని లేఖలో ఆరోపించింది. ‘‘రిపబ్లిక్ భారత్ ఛానల్‌లో మంగళవారం ప్రసారమైన వార్త అత్యంత కిరాతకంగా ఉందని, సమాజంలో ద్వేషం పెంచడంతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ ఆరోపించారు. ‘కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్స్ 1994’ ప్రకారం ఆయన టీవీ షో నిబంధనలకు విరుద్ధంగా ఉందని సుస్మితా దేవ్ తీవ్రంగా మండిపడ్డారు.

Next Story

RELATED STORIES