లాక్‌డౌన్‌లో క్రికెట్ మ్యాచ్.. పొలిటికల్ లీడర్‌పై ఎఫ్‌ఐఆర్

X
TV5 Telugu23 April 2020 6:18 PM GMT
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ సర్కార్ లాక్ డౌన్ ను విధించి అమలు చేస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశంలో లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని సర్కార్ తెలిపంది. కానీ కొందరు లాక్‌డౌన్ నిబంధనలను పాటించడంలేదు. మరి కొందరు పోలీసులకు సహకరించకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ జరిగింది.
బారాబంకీ జిల్లాలోని పానపూర్ గ్రామంలో లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో 20 మంది పాల్గొన్నారు. అయితే క్రికెట్ మ్యాచ్ నిర్వహణపై కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్ నిర్వహణకు కారకులైన పొలిటికల్ లీడర్ సుధీర్ సింగ్‌తో పాటు మ్యాచ్‌లో పాల్గొన్న మిగతా వారిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Next Story