మోదీ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం

మోదీ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం

దేశం మొత్తం లాక్డౌన్ అమలవుతోంది. ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గాలను అన్వేషిస్తూ అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్రం. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్ నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంచరాదని నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటి నుంచి పెండింగ్ ఉన్న మొత్తాన్ని కూడా చెల్లించేది లేదని తేల్చి చెప్పింది.

దీని ప్రకారం 2021 జులై వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, డీఆర్ పెరగదని స్పష్టమవుతోంది. మొదటి విడత లాక్డౌన్‌ని సమర్ధవంతంగా పూర్తి చేసి రెండో విడత లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆర్థిక రంగానికి సంబంధించిన మరిన్ని నిర్ణయాలు కేంద్రం తీసుకునే అవకాశం ఉంది. దానిలో భాగమే డీఏ పెంచకూడదనే నిర్ణయం. ఇప్పటికే ఎంపీల జీతాల్లో కూడా 30 శాతం కోత విధించారు.

Tags

Read MoreRead Less
Next Story