కరోనాతో 45 రోజుల చిన్నారి మృతి

కరోనాతో 45 రోజుల చిన్నారి మృతి
X

దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఢిల్లీలో ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే 48 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ కరోనా 45రోజుల పసిపాపను కూడా బలితీసుకుంది. ఇటీవల ఢిల్లీలోని జామా మసీదు ఏరియాలోని 11 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరికి కరోనా పాజిటివ్‌ గా తేలింది. ఈ 11 మందిలో 45రోజుల చిన్నారి కూడా ఉంది. అయితే పాప కరోనాతో మృతి చెందింది. ఈ ఘటనపై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ స్పందించారు. పాపకు కరోనా ఎవరి నుంచి సోకిందనే విషయంపై విచారణ జరుపుతున్నామని సత్యేంద్ర జైన్‌ తెలిపారు. కాగా ఢిల్లీలో ఇప్పటి వరకు అత్యధికంగా 2,248 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES